NTV Telugu Site icon

Car Price Hike: కార్ లవర్స్ కు షాక్.. రేపటి నుంచి పెరగనున్న కార్ల ధరలు

Car

Car

ఆటోమొబైల్ కంపెనీలు కార్ లవర్స్ కు షాక్ ఇవ్వబోతున్నాయి. దిగ్గజ కంపెనీలన్నీ తమ మోడల్ కార్లపై ధరలు పెంచబోతున్నాయి. రేపటి నుంచే కార్ల ధరలు పెరగనున్నాయి. మారుతి సుజుకి మరోసారి తన కార్ల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2025 నుంచి కార్లు ప్రియం కానున్నాయి. మారుతి తన పోర్ట్‌ఫోలియోలోని కార్ల ధరలను వచ్చే నెల నుంచి 4 శాతం వరకు పెంచుతామని తెలిపింది. 2025 సంవత్సరంలో మారుతి తన కార్ల ధరలను పెంచడం మూడోసారి అవుతుంది. దీనికి ముందు జనవరి, ఫిబ్రవరిలలో కూడా ధరలు పెరిగాయి.

Also Read:Sanoj Mishra : మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్

మారుతి తర్వాత దేశంలో అతిపెద్ద వాహనాల విక్రయ తయారీదారు హ్యుందాయ్ కూడా ఏప్రిల్ 2025 నుండి తన కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 2025 నుంచి మొత్తం పోర్ట్‌ఫోలియో ధర 3 శాతం వరకు పెరుగుతుంది. కియా కూడా ఏప్రిల్ 2025 నుంచి తన కార్ల ధరలను పెంచడానికి సన్నాహాలు చేసింది. ఏప్రిల్ 2025 నుంచి కియా కార్లపై 3% వరకు ధర పెరగనున్నది.రెనాల్ట్ కూడా ఏప్రిల్ 2025 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల నుంచి తమ కార్ల ధరలను రెండు శాతం పెంచనున్నట్లు తెలిపారు.

Also Read:UP: ‘‘ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా’’.. రోడ్‌లపై నమాజ్ ఆపడంతో నిరసన..

జపాన్ ఆటోమేకర్ హోండా కార్స్ తో పాటు, దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, మహీంద్రా కూడా ఏప్రిల్ 2025 నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మహీంద్రా తన మోడళ్లపై మూడు శాతం ధర పెంచనున్నట్లు తెలిపింది. కానీ మిగతా రెండు తయారీదారులు తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన కార్ల ధరలను ఎంత పెంచుతారనే దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. లగ్జరీ వాహన తయారీ కంపెనీలు కూడా తమ కార్ల ధరలను పెంచనున్నారు. BMW ధర మూడు శాతం పెరగనున్నది. ముడి సరుకుల ధరలు పెరగడం, నిర్వహణ వ్యయం పెరగడం వంటి కారణాలు కార్ల ధరల పెంపుకు కారణమవుతున్నాయంటున్నారు మార్కెట్ వర్గాలు.