Union Budget 2023: దేశంలో రెవెన్యూ వ్యయం పెరుగుండటంతో మూలధన వ్యయంపై ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. దీనికి చెక్ పెడుతూ కేంద్రం మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సర్కారు దేశంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఖర్చుపెట్టే మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ ఇవాళ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూలధన వ్యయాన్ని ఏకంగా 33 శాతం పెంచుతూ నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టే మూలధన వ్యయం రూ.10లక్షల కోట్లకు పెరిగింది.
Union Budget 2023: ఎన్నికల వేళ.. కర్ణాటకకు భారీ నజరానా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరం కన్నా ఏకంగా 7.5 లక్షల కోట్లను అధికంగా ఖర్చుపెట్టబోతోంది. ఈ కేటాయింపు రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 35 శాతం మూలధన వ్యయాన్ని పెంచిన కేంద్రం.. ఈ సారి మాత్రం 33 శాతాన్ని ప్రవేశపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. 2022-23లో 2.7శాతానికి పెరిగిన క్యాపెక్స్-టు-జీడీపీ నిష్పత్తి కొత్త ఆర్థిక సంవత్సరంలో 3.3శాతంగా అంచనా వేయబడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు రూ.1.3 ట్రిలియన్ల దీర్ఘకాలిక రుణాన్ని కూడా ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు.