Cancer Symptoms: క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. జాగ్రత్త తీసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer Symptoms: ఈ మధ్య కాలంలో ఎవరికి ఎప్పుడు గుండె పోటు వస్తుందో, ఎవరు ఎప్పుడు క్యాన్సర్ బారిన పడతారో అర్థం కావడం లేదు. మన ముందు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా తిరిగిన వారికి అకస్మాత్తుగా క్యాన్సర్ అని తెలుస్తుంది. అయితే ఈ క్యాన్సర్ ను ముందే పసిగట్టగలిగితే వెంటనే అరికట్టవచ్చు. క్యాన్సర్ వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఇక క్యాన్సర్ వచ్చే ముందు ఆకలి తగ్గడం, ఎడతెరిపి లేకుండా దగ్గు , లింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు, కారణం లేకండానే బరువు విపరీతంగా తగ్గిపోవడం, కొన్ని సార్లు అవయవాల నుంచి రక్తం కారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read: Asia Cup 2023: పాకిస్తాన్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. కారణం రవీంద్ర జడేజా! వీడియో వైరల్
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇక బ్రెయిన్ క్యాన్సర్ అయితే తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు అందరిలో ఉన్నా కూడా ఎలా పడితే అలా ప్రవర్తించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే బ్రెయిన్ కి సంబంధించి ఏ పార్ట్ కి అయితే క్యాన్సర్ సోకుతుందో ఆ భాగం చచ్చుబడిపోతుంది. ఇక గొంతు క్యాన్సర్ వస్తే గొంతులో ఏదో ఇరుక్కుంది అన్న భావన ఉంటుంది. మింగడం కష్టంగా ఉంటుంది. ఇక మహిళలల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ లలో ఒకటి సర్విక్స్ క్యాన్సర్. పిరియడ్స్ సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం ఎరుపు, తెలుపు డిశ్చార్జీ వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఇక ఆడవారిలో వచ్చే మరో ప్రధానమైన క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఇది వచ్చే ముందు రొమ్ము పరిమాణంలో మార్పులు కనిపిస్తాయి. రొమ్మును పట్టుకుంటే గడ్డలు తగులుతాయి. పైన చెప్పిన లక్షణాలు ఉన్నంత మాత్రాన అది క్యాన్సర్ అని గ్యారెంటీ కాదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించి నిర్ధారణ చేసుకుంటే మంచిది.
- Tags
- cancer
- Health News
- symptoms
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!