Site icon NTV Telugu

Canal Culvert Collapsed : గుజరాత్ బ్రిడ్జి ఘటన మరువక ముందే కూలిన మరో కల్వర్ట్

Canal

Canal

Canal Culvert Collapsed : గుజరాత్ తీగల వంతెన ఘటన పలు కుటుంబాల్లో విషాదం నెలకొల్పింది. నీటిలో పడిన చనిపోయిన 141 మంది మృతదేహాలను బయటకి తీశారు. మృతుల్లో 56 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తమ వారిని కోల్పోయి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read Also: Thief Send Email: ‘సారీ బ్రో.. డబ్బుల్లేక ల్యాప్ టాప్ తీసుకెళ్తున్నా’ ఓనర్‎కు మెయిల్ చేసిన దొంగ

అయితే ఈ ప్రమాదంలో ఓ నాలుగేళ్ల ఓ బాలుడు మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ఆ చిన్నారి పేరెంట్స్ ఈ ప్రమాదంలో చనిపోయారు. మోర్బీ నగరంలోని ఉమా టౌన్‌షిప్‌లో నివసించే హార్దిక్ ఫాల్దూ తన భార్య మీరాల్‌బెన్, కుమారుడు జియాన్ష్ తో పాటు బావమరిది హర్ష్ ఝలవాడియా, అతడి భార్యతో కలిసి ఆదివారం వంతెన వద్దకు వచ్చారు. వాళ్లు తీగల వంతెన పైకి చేరుకున్న కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హార్దిక్ కుమారుడు జియాన్ష్, బాలుడి మేనమామ హర్ష్ ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read Also: China : లాక్ డౌన్ ప్రకటనతో గోడలుదూకి పారిపోతున్న ప్రజలు..

ఇదిలా ఉంటే.. గుజరాత్‌ ఘటనను మరువకముందే.. యూపీలో అలాంటిదే మరో ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం చందౌలి జిల్లాలోని సరయ్యా గ్రామంలో ఛఠ్ పూజ సందర్భంగా.. కాలువపై నిర్శించిన ఓ కల్వర్టు మీద జనం పోటెత్తారు. పాతబడిన ఆ వంతెన బరువును ఆపలేఖ కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వంతెన కూలిన సమయంలో కాలువలో ప్రవాహం పెద్దగా లేకపోవడం, ఎవరూ నీళ్లలో పడిపోకుండా కూలిన వంతెనపైనే నిబడటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

Exit mobile version