NTV Telugu Site icon

Justin Trudeau: పాడైపోయిన డొక్కు విమానం.. ఇంకా భారత్ లోనే కెనడా ప్రధాని

Trudo

Trudo

Canada Prime Minister Justin Trudeau Jet Got Repaired: రెండు రోజులు జీ20 సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఇతర దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇప్పటికే తమ దేశాలకు చేరుకున్నారు. అయితే సమ్మిట్ ముగిసినప్పటికీ కెనడా ప్రధాని, ఆయన టీం ఇక్కడే ఉండిపోయింది. దీనికి కారణం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెళ్లాల్సిన విమానం రిపేర్ కదలకపోవడం. ట్రూడో బయలుదేరే ముందే ఆయన పాత విమానం మొరాయించింది.దీంతో ఆయనతో పాటు ఆయన వెంట వచ్చిన కెనడా సిబ్బంది కూడా ఇక్కడే ఉండిపోయారు.

Also Read: Food Poisoning: కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో 80 మంది విద్యార్ధినిలు

కెనడా ప్రధాని, ఉన్నతాధికారులు 1980ల నాటి ఎయిర్‌బస్ ఏ310 విమానంలో భారత్ లోని జీ20 సదస్సుకు వచ్చారు. ఈ క్రమంలోనే కెనడా ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఆ డొక్కు విమానం ఇంధనం కోసం అలస్కార, జపాన్ లలో ఆగింది. దీని బట్టే కెనడా ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి విమానాలు అవి మాత్రమే కాకుండా ఒట్టావాలోని దేశ ప్రధాని అధికార నివాసం కూడా దారుణ పరిస్థితుల్లో ఉంది. 2015 ఎంపిక అయినప్పటి నుంచి ట్రూడో అక్కడ ఉండలేదు. దాని మరమ్మత్తుల కోసం డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. దాంతో ఆ భవనం గోడలు కూలిపోయే స్థితిలో అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. అలా వదిలేయడంతో ఆ భవనం ఇంకా పాడైపోయింది. ఇక ప్రస్తుతం ట్రూడో భారత్ నుంచి వెళ్లాలి అంటే ఈ పాత విమానం అయిన బాగుపడాలి లేదంటే అక్కడి నుంచి ఇంకో విమానం వచ్చి అయినా వారిని ఎక్కించుకొని వెళ్లాలి. అయితే తమ టీంను తొందరగానే ఇండియా నుంచి తీసుకువెళతామని కెనడా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈరోజు మధ్యాహ్నానానికి కానీ, రేపు కానీ ట్రూడో టీం తమ దేశానికి చేరుకునే అవకాశం ఉంది.