NTV Telugu Site icon

Canada vs Iran: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన కెనడా..

Canada

Canada

Canada vs Iran: ఇరాన్‌ కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను (IRGC) కెనడా తీవ్రవాద సంస్థ జాబితాలో బుధవారం నాడు చేర్చింది. దీనిపై తాజాగా స్పందించిన ఇరాన్.. కెనడా చర్యను తీవ్రంగా ఖండించింది. కెనడా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ద్వారా గార్డ్స్‌ సైనిక శక్తి ఎలాంటి ప్రభావానికి లోనుకాదు అని వెల్లడించింది. ఇది అవివేకమైన, సాంప్రదాయేతర రాజకీయ- ప్రేరేపిత చర్య అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనానీ ఇవాళ (గురువారం) స్థానిక వార్తా ఏజెన్సీకి తెలిపారు. కెనడా ప్రతిపక్ష శాసనసభ్యులు, కొంత మంది సభ్యుల ఒత్తిడితో కెనడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది పేర్కొన్నారు.

Read Also: JBL Live Beam 3 Price: జేబీఎల్‌ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్‌.. 48 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌!

ఇక, రెవల్యూషనరీ గార్డ్స్‌ను తీవ్రవాద సంస్థగా జాబితాలో చేర్చడంతో ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న మాజీ సీనియర్ ఇరాన్ అధికారుల విచారణకు దారి తీసే అవకాశం ఉంది. గార్డ్స్‌‌‌లోని ఉన్నతాధికారులతో సహా వేలాది మంది సీనియర్ ఇరాన్ ప్రభుత్వ అధికారులు కెనడాలోకి రావడానికి నిషేధం విధించినట్లైంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ ఇరాన్‌లో ప్రధాన సైనిక, రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదిగారు. దీనికి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. మిత్రరాజ్యాల ప్రభుత్వాలు, సాయుధ సమూహాలకు డబ్బు, ఆయుధాలు, సాంకేతికత, శిక్షణ, సలహాలను ఇది అందిస్తుంది.

Read Also: Minister Anagani Satya Prasad: రెవెన్యూ శాఖను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా..

కాగా, 2019లో అమెరికా మొదటగా ఐఆర్‌జీసీని తీవ్రవాద సంస్థగా గుర్తించింది.. ఆ తర్వాత ఇప్పుడు రెండో దేశంగా కెనడా ఉంది. ఇదిలా ఉంటే, 2020 జనవరిలో విమానం పీఎస్752 పై రివల్యూషనరీ గార్డ్స్‌ క్షిపణి దాడి చేయడంతో అందులో ఉన్న 175 మంది ప్రయాణికులు చనిపోయారు. వీరిలో 55 మంది కెనడియన్ పౌరులు ఉండగా, మరో 30 మంది కెనడా శాశ్వత నివాసితులు ఉన్నారు. ఈ ఘటన తర్వాత స్పందించిన ఇరాన్ పొరపాటున విమానంపై క్షిపణి దాడి జరిగిందని వెల్లడించింది.