NTV Telugu Site icon

Hardeep Singh Nijjar killing: నిజ్జర్ హత్య కేసులో ఒకర్ని అరెస్ట్ చేసిన కెనడా పోలీసులు

Nijjar

Nijjar

India vs Canada: సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా వారి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు శుక్రవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. రెండు ప్రావిన్సుల్లో ఒకేసారి సోదాలు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే, కెనడా పోలీసులు మాత్రం ఇంకా రియాక్ట్ కాలేదు. కాగా, గతేడాది జూన్ 18వ తేదీన సర్రీలోని ఓ గురుద్వారాలో ప్రార్ధన ముగించుకుని బయటకు వచ్చిన నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అయితే, ఈ హత్య వెనక ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది.

Read Also: Thummala Nageswara Rao: బీఆర్ఎస్ పరిపాలనలో స్కీములు.. స్కాములయ్యాయి..

ఇక, టొరొంటోలో జరిగిన ఖల్సా డే కార్యక్రమంలోనూ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నిజ్జర్ హత్య గురించి స్పందించారు. ఈ హత్య కెనడా అంతర్గత భద్రతకు ఓ సవాలన్నారు. నిజ్జర్ హత్య వెనక భారతకు చెందిన RAW ఏజెంట్ల హస్తం ఉందని చెప్పుకొచ్చారు. ఇక, కెనడా ప్రధాని ట్రూడో కామెంట్స్ పై భారత్ ఘాటుగా స్పందించింది. ట్రూడోకు ఈలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదన్నారు. కెనడాలో వేర్పాటువాదానికి, హింసకు, తీవ్రవాదానికి రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీప్ జైశ్వాల్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, భారత్‌లోని కెనడా డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించుకుని కేంద్ర ప్రభుత్వం తన నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ ట్రూడో హాజరైన కార్యక్రమంలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.