Site icon NTV Telugu

Butter Milk: మ‌జ్జిగ ప్రతి రోజూ తాగొచ్చా? అలా చేస్తే సమస్యలు వస్తాయా?

Butter

Butter

Can we Drink Butter Milk Every day: మజ్జిగ అనేది మన భారతీయ వంటకాలలో ఒక భాగం. మన ఆహారంలో ప్రతి రోజూ మజ్జిగ లేదా పెరుగు ఉండాల్సిందే. ఎన్ని తిన్నా చివరికి మజ్జిగతోనే మన భోజనం ముగుస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో మజ్జిగ ప్రధానంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అజీర్తితో ఉన్న వారికి మజ్జిగ తాగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మజ్జిగతో చాలా ప్రయోజనాలే ఉన్నాయి. పాల కంటే మజ్జిగే ఆరోగ్యానికి మంచిది. మ‌జ్జిగ‌లో పొటాషియం, విట‌మిన్ బీ12, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కాల్షియం ఎముకలను బలంగా చేస్తుందనే సంగతి తెలిసిందే.

Also Read: Vaccine: చిన్న పిల్లలే కాదు.. పెద్దలు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ లు కూడా ఉన్నాయి

ఇందులోని లాక్టిక్ ఆమ్లాలు, ప్రొబ‌యోటిక్ కార‌ణంగా పేగుల‌ను ఆరోగ్యంగా ఉంటాయి. ఏవైనా హాని చేసే బ్యాక్టీరియాలు, వైరస్ లు, క్రిములు ఉన్నా కూడా మజ్జిగలో ఉండే ఆమ్లాలు వాటిని నాశనం చేస్తాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధ‌ప‌డే వారికి మ‌జ్జిగ స‌రైన ద్రావ‌ణం. ప్రతి రోజు ఒక గ్లాస్ మ‌జ్జిగ తీసుకుంటే కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకోవ‌చ్చు. ఇక మనం బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ లు తిన్నప్పుడు కూల్ డ్రింక్స్ కాకుండా మజ్జిగను తీసుకుంటే ఎంతో మంచిది. త్వరగా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక నిద్రలేమితో బాధపడేవారు కూడా రోజుకు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది. ఇక అయితే మనలో చాలా మందికి రోజూ మజ్జిగ తాగితే ఎలాంటి నష్టాలు జరగవా అనే సందేహం కలుగవచ్చు. అయితే  మజ్జిగను చిక్కగా కాకుండా పలుచగా తీసుకుంటే రోజూ తీసుకున్నా ఎలాంటి నష్టాలు జరగవని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక మజ్జిగ మరింత రుచిగా ఉండాలంటే దాంట్లో క్యారెట్ తురుము, ఉప్పు, కాస్త కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవచ్చు. అప్పుడు రుచిగా మాత్రమే కాకుండా శరీరం డీహైడ్రేట్ కాకుండా కూడా చేస్తోంది మజ్జిగ.

 

Exit mobile version