Call 108 For Lift: మా అత్తగారింట్లో దించండి సార్.. తప్పతాగి అర్థరాత్రి 108కు ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Call 108 For Lift: అత్తగారింటికి వెళ్లేందుకు మద్యం మత్తులో 108కు కాల్ చేశాడు ఓ మందుబాబు. తప్పతాగి అర్థరాత్రి 108కు మందు బాబు ఫోన్ చేసిన ఘటన హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరిలో చోటుచేసుకుంది. కాళ్లలో నొప్పి వేస్తోందని, నడవలేకపోతున్నానని ఓ వ్యక్తి 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. దీంతో క్షణాల్లో ఫోన్ చేసిన వ్యక్తి వద్దకు యాదగిరిగుట్ట 108 వాహనం చేరుకుంది. అయితే అతడి ఆరోగ్యం బాగానే ఉందని, కేవలం లిఫ్ట్ కోసమే కాల్ చేశాడని అంబులెన్స్‌లోని సిబ్బందికి అర్థం అయ్యింది. అంబులెన్స్ సిబ్బంది, అతడికి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: CM Revanth Reddy : మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం.. ఈ బడ్జెట్లోనే వాటికి నిధుల కేటాయింపు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్న కె.రమేష్ అనే వ్యక్తి జనగామలోని తన అత్తగారింటికి వెళ్లాలని కాలినడకన వెళ్లాలని భావించాడు. అయితే 40 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన భువనగిరికి చేరుకున్నాడు. కాళ్లు నొప్పి వేయడంతో ఫ్రీగా అత్తగారింటికి వెళ్లాలనే ఉద్దేశంతో ఏకంగా అంబులెన్స్‌కు కాల్ చేశాడు. ఏదో ఎమర్జెన్సీ ఉందని భావించిన అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని గుర్తించి అవాక్కయ్యారు. అతడిని ఎందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేశావని సిబ్బంది ప్రశ్నించారు. తాను నడవలేకపోతున్నానని, ఎప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతానో తెలియదని ఆ వ్యక్తి చెప్పాడు. తనకు జనగామ వరకు లిఫ్ట్ ఇవ్వాలని, జనగామలో తాను వెళ్లాలనుకున్న ప్రాంతానికి బస్సు సౌకర్యం లేదని చెప్పాడు. అతడి మాటలు విన్న అంబులెన్స్ సిబ్బంది ఆశ్చర్యపోయారు.
Read Also: Protest : పోలీస్ కంట్రోల్ రూమ్ ముందు ట్రాక్టర్ డ్రైవర్లు నిరసన
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించడానికే అంబులెన్స్‌ను వినియోగించాలని ఆ వ్యక్తికి సిబ్బంది వివరించారు. కానీ రమేష్ వారిని సులభంగా వదలలేదు. తాను తీవ్రమైన కాళ్ల నొప్పులతో బాధపడుతున్నానని, అంబులెన్స్‌లో జనగామకు తరలించాలని కోరారు. అయితే దానిని సిబ్బంది తిరస్కరించారు. కాళ్ల నొప్పులు వస్తే భువనగిరి ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్తామని చెప్పారు. అయినా అక్కడికి వద్దని రమేష్ తిరస్కరించాడు. తన చేతిలో రాడ్ ఉందని, అలసటతో పాటు నొప్పిగా ఉందని వేడుకుంటూ జనగామలో దింపాలని పట్టుబట్టాడు. మందు బాబును జనగామలో దింపడానికి నిరాకరించి… భువనగిరి ఆసుపత్రిలో చేర్పిస్తామని చెప్పినా మందుబాబు వినిపించుకోలేదు. ఈ క్రమంలో అంబులెన్స్ సిబ్బంది అతనికి నచ్చజెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!