SLBC టన్నెల్‌లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను తీసుకొచ్చారు. రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లలో 2 డాగ్స్ ను తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నెల్ లోకి తీసుకెళ్లాయి. ఐఐటీ నిపుణుల బృందంతో సింగరేణి, NDRF బృందాలు టన్నెల్‌లోకి వెళ్లాయి… డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
READ MORE: Mohammed Shami: మహ్మద్ షమీ “క్రిమినల్”.. ముస్లిం సంస్థ చీఫ్ ఆగ్రహం.. ఏమైందంటే..
కాగా.. మరోవైపు.. రెస్క్యూ ఆపరేషన్ లో ఇకపై రోబోలు పాల్గొననున్నాయి. SLBC టన్నెల్ లో 13 వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృత దేహాల కోసం మార్క్ చేసిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో పాటు డీ వాటరింగ్ కొనసాగుతోంది. TBM మిషన్ ను ప్లాస్మా కట్టర్ లతో రెస్క్యూ బృందాలు కట్ చేస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ మళ్ళీ మొరాయించడంతో నిలిచిన మట్టి తరలింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక, SLBC టన్నెల్ వద్దకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చేరుకుంది. హైదారాబాద్ కి చెందిన NV రోబోటిక్స్ తో కలిసి టన్నెల్ లోపల పరిశీలించిన అధికారులు.. రోబోల వినియోగం.. సాధ్యం అవుతుందా లేదా అనే విషయమై సమీక్ష నిర్వహిస్తున్నారు. అవసరమైతే రోబోలు వాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో అధికారులు మరో ప్రయత్నం చేస్తున్నారు.