NTV Telugu Site icon

Minister Payyavula Keshav: వృద్ధుల వైద్య బీమా ప్రీమియంపై ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలి..

Payyavula Keshav

Payyavula Keshav

Minister Payyavula Keshav: జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియంలపై ఉన్న జీఎస్టీ రేటుపై జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం పునః పరిశీలించింది. జీఎస్టీ కౌన్సిల్ నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం తొలి సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. జీవిత, వైద్య భీమా ప్రీమియంలపై 18%గా ఉన్న జీఎస్టీని తగ్గించే దిశగా మంత్రి వర్గ ఉప సంఘంలో కీలక చర్చ జరిగింది. జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియంలపై ఉన్న జీఎస్టీ విషయంలో మంత్రి పయ్యావుల కీలక సూచనలు చేశారు.

వృద్ధుల వైద్య బీమా ప్రీమియంపై ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలని పయ్యావుల సూచించారు. పేదలు.. మధ్య తరగతి ప్రజలకు వైద్య బీమాను చేరువ చేయాలని సూచించారు. రూ. 5 లక్షల వరకు ఉన్న వైద్య బీమా ప్రీమియం పైనా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. మిగిలిన అన్ని రకాల వైద్య బీమా పాలసీలపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికే పరిమితం చేయాలన్నారు. ప్రీమియంపై చెల్లించే 5 శాతం జీఎస్టీ కూడా ఇన్కం ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. మానసిక వికలాంగుల వైద్య బీమా పాలసీలపై వున్న జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిలుకు పయ్యావుల ప్రతిపాదించారు. జీఎస్టీ మినహాయింపులు, వెసులుబాట్లు వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతోన్న పేదలు, వృద్ధులకు మేలు చేసేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు.