Cabinet Sub Committee: జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

  • మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
  • పలు కీలక నిర్ణయాలు ప్రకటన
Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

Cabinet Sub Committee: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, శివశంకర్ (రిటైర్డ్ ఐఏఎస్), జీఏడి అధికారులు పాల్గొన్నారు . ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది . కేబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతులకు పంపించాల్సిందిగా జీఏడి అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన అనంతరం తిరిగి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ సమావేశంలో నిర్ణయించింది.

Read Also: Shock to BRS: బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌.. రేపు కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే!