NTV Telugu Site icon

TG Govt: 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. 9 శాఖలపై చర్చ

Cabinet Sub Comitee

Cabinet Sub Comitee

317 జీవోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో 9 ప్రభుత్వ శాఖలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖల పరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ సమావేశంలో పలు అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడం జరిగింది. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

Show comments