NTV Telugu Site icon

Waqf Board: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం?.. కేంద్రంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Asaduddin (2)

Asaduddin (2)

వక్ఫ్ బోర్డు‌ అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా వార్తలొస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ సమచారం మేరకు.. శుక్రవారమే కేబినెట్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మూకుమ్మడిగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా.. త్వరలోనే పార్లమెంటులో అందుకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ చట్టం (1954)లో 40కి పైగా సవరణలను తాజా గా కేంద్ర ప్రభుత్వం చేర్చబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా వక్ఫ్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాలు భూమి ఉంది.

READ MORE: Anam Ramanarayana Reddy: టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని జలాశయాలు నిండి పోయాయి..

ఆస్తులపై వక్ఫ్ బోర్డు అధికారాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకురానున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ఆధిపత్యానికి, అధికారాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. వక్ఫ్ బోర్డు మీడియాకు స్వయంప్రతిపత్తిని హరించేందుకు మోడీ యత్నిస్తున్నారు. ఈ ప్రతిపాదిత సవరణ గురించి మీడియాలో రాసేలా చేస్తున్నారు. వక్ఫ్ ఆస్తులకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకం. వారికి హిందూత్వ ఎజెండా ఉంది. వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తి కోల్పోవడంతో దానిపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుంది. వక్ఫ్ స్వాతంత్ర్యం దెబ్బతింటుంది. అప్పుడు కేంద్రం ఈ ఆస్తి వివాదాస్పదమని, దానిని సర్వే చేయిస్తామని తెలుపుతుంది. ఆ సర్వే బీజేపీ, సీఎంలు చేయిస్తారంటే దాని ఫలితం ఎలా ఉంటుందో తెలిసిందే. మన భారతదేశంలో వక్ఫ్ బోర్డుకు చెందిన చాలా దర్గాలు ఉన్నాయి, అవి దర్గాలు, మసీదులు కాదని బీజేపీ-ఆర్ఎస్ఎస్ వాదించాయి. ఇప్పుడు వారి చేతికి బోర్డు చిక్కితే నాశనం చేస్తారు.” అని పేర్కొన్నారు.

Show comments