MLC C Ramachandraiah: అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా: ఎమ్మెల్సీ రామచంద్రయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్సీ పదవికి సీ రామచంద్రయ్య రాజీనామా చేశారు. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే తాను రాజీనామా చేశానని రామచంద్రయ్య తెలిపారు. ఎమ్మెల్సీగా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా.. రాజీనామా చేస్తున్నా అని, ప్రజా జీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా అని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం వైఎస్ జగన్ చూసుకోవాలన్నారు. తప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదని, క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని రామచంద్రయ్య చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం సీ రామచంద్రయ్య మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా. ఎమ్మెల్సీగా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా.. రాజీనామా చేస్తున్నా. ప్రజాజీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా. ఇప్పటివరకు రాజకీయ విలువలు కాపాడుకుంటూ వచ్చా. వైసీపీలో ఉన్నందుకు చాలాకాలం నుంచి అంతర్మధనం చెందా. కొంతకాలం నుంచి మీడియాకు దూరంగా ఉన్నా. ప్రజల ఆస్తులను కాపాడుకోలేకపోయాం. తప్పిదాలను సీఎం జగన్‌కు చెప్పడానికి అవకాశం రాలేదు. జగన్‌తో మనసు విప్పి మాట్లాడే అవకాశం రాలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ చూసుకోవాలి’ అని అన్నారు.
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
Also Read: Shaik Mastan Vali: వైఎస్ఆర్ కలను నిజం చేయటానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు!
‘పార్టీలో నుంచి బయటకు వచ్చామని స్క్రాప్ అంటున్నారు. పార్టీలో చేరమని మా ఇంటిచుట్టూ తిరిగినప్పుడు స్క్రాప్ అని తెలియదా?. వైసీపీలో రాజకీయంగా ప్రజాస్వామ్యం కనిపించలేదు. సలహాదారులైనా సరైన సలహాలు ఇచ్చి జగన్‌ను మారిస్తే బాగుంటుంది. క్యాడర్ సలహాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వందల కోట్లు ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారు. కేసుల కోసం కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారు. సాధికారత సభల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు’ అని సీ రామచంద్రయ్య చెప్పుకొచ్చారు.
- Tags
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!