Indian Air Force: భారత్ వాయుసేనలో చేరిన సీ–295 యుద్ద విమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
C 295 Transport Aircraft Bharat : భారత వైమానిక దళ సామర్థ్యం మరింత పెరగనుంది. భారత వాయుసేన అమ్ముల పొదిలో కొత్త యుద్ధ విమానాలు రానున్నాయి. బుధవారం స్పెయిన్ లోని సెవెల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరికి తొలి సీ–295 విమానాన్ని స్పెయిన్ అధికారులు అందిచారు. ఈ విమానం శుక్రవారం భారత్ కు చేరుకోనుంది. అందులో కాసేపు ప్రయాణించారు భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది ఆత్మనిర్భర్ భారత్ కు నిదర్శనమన్నారు. వాయుసేన వ్యూహాత్మక ఎయిర్ లిఫ్ట్ సామర్థ్యాలను ఇది మెరుగుపరుస్తుందని చెప్పారు. దేశంలో కొత్త శకానికి ఇది నాంది పలుకుతుందని పేర్కొ్న్నారు.
Also Read: Google: మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ప్రతేడాది గూగుల్ ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
Also Read
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
సీ–295 యుద్ధ విమానాల కొనుగోలుకు స్పెయిన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మొత్తం 56 విమానాలకు రూ.21,935 వేల కోట్లతో డీల్ కుదిరిందని ఈ డీల్‌లో భాగంగా 16 విమానాలను 2025లోగా స్పెయిన్ తయారు చేసి ఇస్తుందని వివరించారు. 17వ విమానం నుంచి భారత్ లో వీటి తయారీ మొదలవుతుందని, మిగతా 40 యుద్ధ విమానాలను గుజరాత్ లోని వడోదరలో తయారు చేయడానికి టీఏఎస్ఎల్ కంపెనీతో స్పెయిన్ కంపెనీ డీల్ కుదుర్చుకుందని తెలిపారు. ఇది దేశంలో తయారైన మొదటి మిలిటరీ రవాణా విమానం అవుతుందన్నారు. ఈ విమానంలో ఒకేసారి 71 మంది జవాన్లను లేదంటే 50 మంది పారాట్రూపర్లను సరిహద్దులకు తరలించవచ్చని వివరించారు. వాయుసేన చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి. దీంతో భారత్ బలం మరింత పెరగనుంది.
తాజావార్తలు
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!