NTV Telugu Site icon

Humans Ashes: మనిషి బూడిదకు ఇంత డిమాండా..? చితాభస్మంతో కోట్లలో సంపాదన

Human Ashes

Human Ashes

మనిషిగా పుట్టినవారు చావక తప్పదు.. చనిపోయిన తర్వాత మృదదేహాన్ని కాల్చేసి.. ఆ బూడిదను పవిత్ర జలాల్లో కలుపుతారు. ఈ సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది.. కానీ, మనిషి చితాభస్మంతో కోట్లలో సంపాదిస్తున్నారంటే నమ్ముతారా..? అవును మీరు వింటున్నది నిజమే జపాన్ ప్రభుత్వం మనిషి బూడిదతో వందల కోట్లలో సంపాదిస్తుంది. స్మశాన వాటికల్లో బూడిదను తీసుకుని వెళ్లి జపాన్ ప్రభుత్వం బిజినెస్ చేస్తోంది. అయితే.. ఆ బూడిదతో ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also: Currncy Notes in Drain: మురికి కాలువలో రూ.500 నోట్లు.. ఎగబడిన జనం

ఇంతకుముందు జపాన్‌లో ఎవరైనా చనిపోతే.. వారి బూడిదను నీటిలో కలిపేవారు. అయితే.. తాజాగా ఆ బూడిదలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్‌కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలున్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో.. గత ఐదేళ్లలో చనిపోయిన 15 లక్షల మంది బూడిద నుంచి లోహాలను ప్రభుత్వం సేకరించింది. అనంతరం వాటిని అమ్మకానికి పెట్టగా రూ.400 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయాన్ని పబ్లిక్ ప్రదేశాలను డెవలప్ చేయడంతో పాటు.. దేశంలో ఉన్న శ్మశాన వాటికల నిర్వహణ కోసం ఖర్చు చేస్తోంది. అయితే.. మనిషి బతికున్నప్పుడే విలువ.. చనిపోయాక ఏం ఉపయోగం ఉంటుంది అనుకుంటాం కదా.. కానీ జపాన్ ప్రభుత్వం చనిపోయిన తర్వాత మనుషుల బూడిదతో కూడా డబ్బు సంపాదిస్తోంది. మొత్తానికి మనిషి చితాభస్మం కూడా విలువైందే.

Read Also: Mohammed Shami: షమీ ఫిట్‌నెస్‌పై బిగ్ అప్‌డేట్.. ఆస్ట్రేలియా టూర్‌కు స్టార్ బౌలర్..!