Site icon NTV Telugu

B.V Raghavulu : 2 వేల నోట్ల రద్దు సరైంది కాదు

Bv Raghavulu

Bv Raghavulu

2 వేల నోట్ల రద్దు.. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ. రాఘవులు స్పందించారు. ఇవాళ ఆయన గచ్చిబౌలి లోని ఎస్‌వీకేలో జరిగిన పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీ.వీ. రాఘవులు మాట్లాడారు. 2 వేల నోట్లను ఉపసంహరిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో లీగల్ టెండర్ గా కొనసాగుతోందని ప్రకటన చేశారు అది మోసపూరితమైన ప్రకటన అని, ఆర్బీఐ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘గతంలో నోట్ల ఉపసంహరణ వల్ల ఏం లాభం చేకూరిందో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు..

Also Read :AP : ఏపీ సముద్రతీర ప్రాంతంలోని 32 లక్షల మంది ప్రజలకు ముంపు ముప్పు..

గతంలో నోట్ల రద్దు చేయడం వలన ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది.. ఇంక కోలుకోలేని పరిస్థితి.. 2 వేల నోట్ల ఉపసంహరణపై పార్లమెంటులో చర్చ పెట్టాలి. ఆర్బీఐ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉంది. సన్న, చిన్న, మధ్య తరగతి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది… అవినీతిని కప్పి పెట్టేందుకే ఇలాంటి నిర్ణయాలు. రెండు వేల రూపాయల ఉపసంహరణ నిర్ణయాన్ని ఆర్బీఐ వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆర్థిక వ్యవస్థను కార్పోరేట్ చేతుల్లోకి తీసుకెళ్లేందుకే ఈ నిర్ణయం… గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో అవినీతిని అంతం చేస్తామని, ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని, నకిలీ నోట్లు అరికడతామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు…’ అని ఆయన మండిపడ్డారు.

Also Read : Venkatesh: ఎన్టీఆర్ తో సినిమా చేయలేదు అన్న బాధ.. అందుకే ఆ పని చేశా

Exit mobile version