NTV Telugu Site icon

iPhone 13 Price Drop: ₹52,499కే ఐఫోన్ 13.. కొనాలనుకున్న వారు డోంట్ మిస్!

Iphone 13

Iphone 13

Buy iPhone 13 Only for Rs 52,499 in Flipkart: iPhone 15 సిరీస్‌ సేల్స్ మొదలు పెట్టిన తర్వాత, iPhone లోని అంతకు ముందు సిరీస్ ఫోన్లు ఇపుడు తక్కువ ధరకు అందుబాటులోలి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా iPhone 13 128 GB వేరియంట్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అయిన Flipkartలో  ఇప్పుడు ఏకంగా ₹52,499కి అందుబాటులోకి వచ్చింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో దీని ధర ₹ 59,900 కాగా అంతకన్నా తక్కువకే ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ iPhone-13 ₹ 256 GB 61,499 కాగా 512GB వేరియంట్ ₹ 74,999 వద్ద అందుబాటులో ఉంది.

ఐఫోన్ 13 ఏ వేరియంట్‌లో ఎంత తగ్గింపు?

మెమరీ యాపిల్ వెబ్‌సైట్ ధర ఫ్లిప్ కార్ట్ ధర ప్రారంభ ధర
128GB ₹59,900 ₹52,499 ₹69,900
256GB ₹69,900 ₹61,499 ₹79,900
512GB ₹89,990 ₹74,999 ₹99,900

ఇక ఆ ఫోన్ కి దాదాపు ₹ 30,600 ఎక్స్ఛేంజ్ తగ్గింపు కూడా అందించబడుతుంది. iPhone 13పై తగ్గింపుతో పాటు, ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్ కూడా ₹ 30,600 వరకు స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది. అయితే, ఎక్స్ఛేంజ్ లో ఫోన్ విలువ, దాని స్థితి అలాగే రీసేల్ విలువపై ఆధారపడి ఉంటుంది.

ఇక ఇటీవల యాపిల్ కంపెనీ iPhone 14, iPhone 14 Plus మరియు iPhone 13 ధరలను ₹ 10 వేలు వరకు తగ్గించింది. iPhone 15 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత, Apple iPhone 14, iPhone 14 Plus మరియు iPhone 13 ధరలు ₹ 10 వేలు తగ్గించింది. కొత్త ధరలను కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది.

Show comments