NTV Telugu Site icon

Double Hat trick: బుడ్డోడే గానీ రికార్డు నెలకొల్పాడు.. 6 బంతుల్లో 6 వికెట్లు..!

Bowl

Bowl

Double Hat trick: బుడ్డోడే గానీ.. రికార్డు నెలకొల్పాడు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ తో చరిత్ర సృష్టించాడు. మాములుగా క్రికెట్ మ్యా్చ్ లో బౌలర్ కి ఒక హ్యాట్రిక్ తీయడమే కష్టమైన పని. అలాంటిది ఆ పన్నేండళ్ల బాలుడు డబుల్ హ్యాట్రిక్ తో సంచలనం రేపాడు. ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీశాడు. ఆ బాలుడు ఇంగ్లండ్ కు చెందిన ఆలివర్ వైట్ హౌస్. ఇంగ్లండ్‌లోని బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌తో ఆడుతూ ఆలివర్ ఈ సంచలనం నెలకొల్పాడు. డబుల్ హ్యాట్రిక్ పట్ల పలువురు సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Pawan Kalyan: నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. ఏ వ్యూహం అయినా వేస్తా..

అయితే అలా రికార్డు నెలకొల్పడానికి ఒలివర్ ఆట వెనుక కృషి, పట్టుదల ఎంతో ఉంది. చిరకాలం నిలిచే తన ఆటతో అలాంటి ప్రభావాన్ని మిగిల్చాడు. ఆ బాలుడు కెరీర్ లోనే ఈ ప్రదర్శన ఒక చరిత్రగా నిలుస్తుందని.. ఇది అతని అత్యుత్తమ క్రికెట్ కెరీర్‌కు నాంది కూడా కావొచ్చని అంటున్నారు. బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ మొదటి జట్టు కెప్టెన్ జాడెన్ లీవిట్ BBCతో మాట్లాడుతూ.. ఆలివర్ చేసిన పనికి మేము ఆశ్చర్యపోతున్నామని, అంతేకాకుండా తాను నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ఆలివర్‌కి ఇది ఎంత పెద్ద రికార్డో తెలియదు. అయితే దాని ప్రాముఖ్యత తరువాత వారికి తెలుస్తుందని’ చెప్పుకొచ్చాడు.

Read Also: Nandamuri Balakrishna: బాలయ్యతో జోకులు.. కమెడియన్ పంట పండినట్టే

బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో డబుల్ హ్యాట్రిక్‌తో ఆలివర్ ఫోటోను షేర్ చేసింది. కొన్ని గంటల్లోనే ఆలివర్ హీరోగా మారాడు. ఇప్పుడా ఆ బుడ్డోని పేరు ట్విట్టర్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ కొన్ని గంటల్లో 45,000 వ్యూస్ దాటింది. ఈ మ్యాచ్‌లో ఒలివర్ మొత్తం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఎలాంటి పరుగులు ఇవ్వకుండా మొత్తం ఎనిమిది వికెట్లు తీశాడు. ఆలివర్ కుటుంబం ఇంతకుముందు క్రీడలతో అనుబంధం కలిగి ఉంది.. అతని అమ్మమ్మ అద్భుతమైన టెన్నిస్ క్రీడాకారిణి. ఆలివర్ అమ్మమ్మ 1969లో వింబుల్డన్ గెలుచుకుంది. ఆమె పేరు ఆన్ జోన్స్.