Site icon NTV Telugu

Bus Accident: 13 మందిని బలిగొన్న ఫిట్‌నెస్ లేని బస్సు.. బీజేపీ నేతకు చెందినదిగా గుర్తింపు

Bus Accident

Bus Accident

Bus Accident: మధ్యప్రదేశ్‌లోని గుణాలో బుధవారం జరిగిన ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సులో ‘ఫిట్‌నెస్ సర్టిఫికేట్’ లేదని గుర్తించారు. ఇక, ఆ బస్సు బీజేపీ నేతకు చెందినదని తెలిసింది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుణ-ఆరోన్ రోడ్డులో బస్సు డంపర్‌ను ఢీకొనడంతో మొత్తం 13 మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు అగ్నిగోళంగా మారింది. ఈ ప్రమాదంలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: Priyanka ED Case: మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్‌లో ప్రియాంక గాంధీ పేరు..

ఇంతలో, ప్రమాదానికి సంబంధించి రవాణా అధికారి రవి బరేలియా, చీఫ్ మునిసిపాలిటీ అధికారి బీడీ కటరోలియాను సస్పెండ్ చేశారు. అగ్నిమాపక దళం రాక ఆలస్యం కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ప్రాణాలతో బయటపడిన వారిలో కొంతమంది ప్రకారం, బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. ఈ బస్సులో ఓ గర్భిణీ స్త్రీ కూడా ఉండగా.. ఆమె నుదిటిపై గాయాలయ్యాయి.

Read Also: Maharashtra: మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన 23 సీట్ల డిమాండ్‌.. తిరస్కరించిన కాంగ్రెస్!

అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె ప్రార్థించారు. “మధ్యప్రదేశ్‌లోని గుణాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించారనే వార్త బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ముర్ము ఎక్స్‌(ట్విట్టర్‌) పోస్ట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version