NTV Telugu Site icon

Bus Fire: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం

Fire 1

Fire 1

రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం అయిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఘోర ప్రమాదం జరిగింది. అనాతవరం సచివాలయం ముందు నిలిపిఉంచిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం అయింది. బస్సులో మంటలు వ్యాపించడంతో వెంటనే అలర్ట్ అయ్యాడు బస్ డ్రైవర్. దీంతో సురక్షితంగా బయటపడ్డాడు డ్రైవర్, స్దానికుల సమాచారంతో మంటలార్పారు అగ్నిమాపక సిబ్బంది.

ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ ఒక్కరే ఉన్నాడు.. వెంటనే అప్రమత్తమై బయటకు దూకేశాడు స్దానికుల సమాచారంతో మంటలార్పారు అగ్నిమాపక సిబ్బంది, బస్సు దగ్దం కావడానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఎవరైనా నిప్పు పెట్టారా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: Millets: గుడిసెలో నివసించే మహిళ.. ఇప్పుడు మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్
తిరుమలగిరిలో దారుణం
హైదరాబాద్ గంజాయికి అడ్డాగా మారుతోంది. గంజాయికి బానిసైన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సెరినిటీ ఫౌండేషన్ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కెవిన్ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు సెరినిటీ ఫౌండేషన్ సిబ్బంది. 26వ తేదీన కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు సిబ్బంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెవిన్ ను హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నించాలంటున్నారు తల్లిదండ్రులు.

Read Also: Astrology: ఫిబ్రవరి 04, శనివారం దినఫలాలు