Site icon NTV Telugu

Bus Fire Accident : కాలేజీ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం..

Bus Fire

Bus Fire

Bus Fire Accident : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రేపల్లె పట్టణంలోని ఐఆర్ఈఎఫ్ సంస్థలకు చెందిన నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రం గుంటూరు కావడంతో, 30 మంది విద్యార్థినులను పరీక్ష రాయించేందుకు బస్సులో తీసుకువెళ్లారు. సరిగ్గా గూడవల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తై బస్సును ఆపాడు. విద్యార్థులను హుటాహుటిన కిందకు దించి కొద్దిసేపటికే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయింది.

Wayanad: నేడు వయనాడ్కు ప్రియాంక, రాహుల్.. కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

విద్యార్థులు వెంటనే మరొక వాహనంలో ప్రయాణించి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. స్థానికులు ఫైర్ ఇంజిన్​కు సమాచారం ఇచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. డ్రైవర్ యొక్క అప్రమత్తత కారణంగా విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం ఎదురయ్యింది. అయితే, ప్రైవేటు కాలేజీ బస్సుల్లో తప్పనిసరిగా ఫైర్ కిట్​లు ఉండాలని, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల కాలేజీలు, స్కూల్స్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చినాయి.

Israel–Hamas war: నేడు ఇజ్రాయెల్‌ హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చ

Exit mobile version