Bus Fire Accident : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రేపల్లె పట్టణంలోని ఐఆర్ఈఎఫ్ సంస్థలకు చెందిన నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రం గుంటూరు కావడంతో, 30 మంది విద్యార్థినులను పరీక్ష రాయించేందుకు బస్సులో తీసుకువెళ్లారు. సరిగ్గా గూడవల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తై బస్సును ఆపాడు. విద్యార్థులను హుటాహుటిన…