NTV Telugu Site icon

PM Modi: బుర్జ్ ఖలీఫాపై భారత ప్రధాని మోడీ ఫోటో

Burj Khalifa

Burj Khalifa

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ఇవాళ(శనివారం) యూఏఈకి వెళ్లారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకంతో పాటు మోడీ ఫోటోను ప్రదర్శించి గ్రాండ్‌గా వెల్ కమ్ పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రధాని నరేంద్ర మోడీకి అబుదాబి విమానాశ్రయంలో దిగగానే.. ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.

Read Also: Monsoon Disease: వర్షాకాలంలో ఈ అలవాట్లను పాటిస్తే.. వ్యాధులు దరిచేరవు..!

అనంతరం ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులపై అబుదాబిలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు జరిపారు. అయితే, స్థానిక కరెన్సీలలో వాణిజ్య పరిష్కారాన్ని ప్రారంభించడానికి భారత్- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగీకరించినట్లు ప్రకటించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్నందున త్వరలో దాన్ని 100 బిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని ప్రధాని మోడీ ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Read Also: ‘Baby the Movie: నేను అనుభవించిన ఎనిమిది నెలల ప్రేమ నరకమే ‘బేబీ’: డైరెక్టర్ సాయి రాజేష్

అయితే, ఇరువురు మధ్య పలు కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇక, భారత్-యూఏఈల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆహార భద్రత, శాస్త్ర, సాంకేతికత, విద్య, ఫిన్‌టెక్, రక్షణ, భద్రత వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, భారత్ జీ-20 దేశాల అధ్యక్షుడిగా ఉండటంతో ప్రపంచ సమస్యలపై సహకారాన్ని చర్చించడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుంది అని మోడీ అన్నారు.