మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఫిలింనగర్‌లోని పొన్నాల ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు అపహరణకు గురయ్యాయి. పొన్నాల సతీమణి అరుణా దేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పొన్నాల ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ చోరీ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: BRS Rythu Dharna: నేడు షాబాద్‌లో బీఆర్‌ఎస్ రైతు ధర్నా.. అన్నదాతలకు మద్దతుగా రామన్న!
సంఘటన జరిగిన సమయంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేదని తెలుస్తోంది. దొంగతనం జరిగిన రోజున పొన్నాల జనగాం జిల్లాలో ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పొన్నాల లక్ష్మయ్య చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే, మంత్రిగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడిన పొన్నాల.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే అయన ఎక్కడినుంచి పోటీ చేయలేదు.