NTV Telugu Site icon

Viral : సింహాలను తరిమికొట్టిన ఎద్దు..

Bull

Bull

ప్రస్తుత కాలంలో నెట్టింట ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతిరోజు లక్షల వీడియోలు నెట్టింట అప్ లోడ్ అవుతూ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఇలాంటి వీడియోలు ఎక్కువగా అడవి జంతువులకు సంబంధించిన దృశ్యాలే కనిపిస్తుంటాయి. ఈ వీడియోలను నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లైక్ కొడుతూ వైరల్ చేస్తుంటారు.

Also Read : Dimple Hayathi: నేను డీసీపీని ఇబ్బంది పెట్టలేదు.. అంతపెద్ద ఆఫీసర్‌ను నేనేం చేస్తాను

అయితే.. ఇక్కడ కూడా ఇలాంటి వీడియో ఒకటి చెక్కర్లు కొడుతుంది. సాధారణంగా అడవికి రారాజు సింహం అని చెబుతుంటారు. ఎందుకంటే.. ఒక్కసారి సింహం ఏదైనా జంతువును వేటాడాలని నిర్ణయించుకుంటే చాలు ఇక ఆ జంతువు సింహానికి ఆహారం అయిపోవాల్సిందే. అందుకే ఏ జంతువు కూడా సింహం దరిదాపుల్లోకి వెళ్లడానికి ధైర్యం చేయదు.. కేవలం చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు, జింకలు, జిరాఫీలను కూడా సింహాలు వేంటాడి వేటాడి తమ ఆకలిని తీర్చుకుంటాయి. కానీ, ఇక్కడ మాత్రం ఒక ఎద్దును చూసి సింహాలు పరుగులు తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Also Read : Reliance Jio: జియో బంపరాఫర్‌.. ఈ ప్లాన్‌పై 10 జీబీ డేటా..

గుజరాత్‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎద్దు సింహాల దాడికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఎద్దును చూసి సింహాలు భయంతో పరుగు తీశాయి. ఏకంగా ఐదు సింహాలు ఎదురుపడినా.. ఆ ఎద్దు ఏమాత్రం భయపడకుండా వాటిని తరిమి తరిమి పరిగెత్తించింది. ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. అంతేకాదు.. దూరంగా ఆరుబయట నిద్రస్తున్న ఓ వ్యక్తి కూడా తన మొబైల్ ఫోన్ లో ఈ దృశ్యాలను రికార్డ్‌ చేశారు. గిర్ అభయారణ్యం సమీపంలో ఉండటంతో.. సింహాలు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్ వైరల్ గా మారింది.