Site icon NTV Telugu

Building Collapsed : కూకట్ పల్లి బిల్డింగ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి

Slab1

Slab1

Building Collapsed : కూకట్‌పల్లిలో బీజేపీ ఆఫీస్ సమీపంలో పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు శ్లాబ్‌ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద పడి ఇద్దరు కూలీలు మరణించారు. వీరిని ఉత్తర్ ప్రదేశ్‌కు దయ, ఆనంద్‌గా గుర్తించారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భవనంలో 4వ, 5వ అంతస్తులో పనులు జరుగుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్లాబ్ కింద ఎవరైనా ఉన్నారేమోనని అనుమానిస్తున్నారు స్థానికులు.

Read Also: Shocking : చచ్చిందని శ్మశానానికి తీసుకొచ్చారు.. కాసేపటికే అందరినీ పరుగెత్తించింది

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. రెడీ మిక్స్ కింద ఇద్దరు కూలీలు చిక్కుకొని ఉంటారని తోటి కార్మికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ,రెస్క్యూ టీం,స్థానిక పోలీసులు శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? నిర్మాణంలో ఉన్న భవనం కింద ఎంతమంది ఉన్నారు అనేది అధికారులు ఆరాతీస్తున్నారు.

Read Also: Good News: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త

పనికి వచ్చిన కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. డీఆర్‌ఎఫ్ టీమ్ ఇద్దరు కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. పనుల్లో నాణ్యతాలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. భవనం మరికొంత భాగం కూడా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version