NTV Telugu Site icon

Strange Incident: ఎనిమిది కాళ్లతో జన్మించిన గేదె.. ఎక్కడంటే..?

11

11

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈరోజు ఓ విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది దీనిని ప్రకృతి విపత్తుగా భావిస్తే.. మరి కొందరు అద్భుతంగా భావిస్తున్నారు. ప్రతి వ్యక్తి దానిని విభిన్న కోణంలో చూస్తున్నారు. అయోధ్యలోని సదర్ తహసీల్‌లోని మోద్రా కర్మ కూడలికి సమీపంలో ఒక గేదె ఒక ప్రత్యేకమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు ఒక మొండెం, ఒక తల, ఎనిమిది కాళ్లు ఉన్నాయి. విలక్షణమైన గేదె పుట్టిందన్న వార్త విని, సమీపంలో జనం గుమిగూడారు.

READ MORE: UP Crime: మధురలో దారుణం.. కదులుతున్న కారులో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..

పశువైద్యుడు డాక్టర్ రామ్ కిషోర్ యాదవ్ సమక్షంలో ఆ గేదె ఈ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన గ్రామంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఇది గ్రహణ కాలం యొక్క దుష్ప్రభావం అని అంటున్నారు. గేదె ఎనిమిది కాళ్లతో జన్మించడంతో ఆ బిడ్డ మగదా ఆడదా అని చెప్పడం కష్టంగా మారింది. ఎనిమిది కాళ్లతో ఉన్న గేదె పిల్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వెటర్నరీ డాక్టర్ రాజన్ యాదవ్ స్పందిస్తూ.. ఇది జన్యులోపం వల్ల ఇలా జన్మించిందని.. ఇందులో ఎలాంటి వేరే అర్థం లేదని తెలిపారు. జన్యులోపం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి దూడలు జన్మించడం కామన్ అని చెప్పారు.