NTV Telugu Site icon

Budget Smartphones 2023: ‘బిగ్ బిలియన్ డేస్’ టాప్ డీల్స్.. అతి తక్కువ ధరకే ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్!

Budget Smartphones 2023

Budget Smartphones 2023

Budget Smartphones in India at Flipkart Big Billion Days Sale 2023: ‘దసరా’ పండగకు ముందే.. ఈ-కామర్స్ కంపెనీల ఫెస్టివల్ ఆఫర్లతో జనాలు పెద్ద పండగ చేసుకుంటున్నారు. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’, ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’లో వివిధ రకాల ప్రొడక్ట్స్ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్‌ అప్లయెన్సెస్‌, ఫ్యాషన్స్.. ఇలా అన్ని వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ టాప్ ఆఫర్లను అందిస్తోంది. డాఅన్తో కొన్ని ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ప్రీమియం మొబైల్స్ ఏవో ఓసారి చూద్దాం.

APPLE iPhone 14:
ఐఫోన్ 14ను ఇప్పుడు మీరు రూ. 56,999కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 (Blue, 128 GB) అసలు ధర రూ. 69,900 కాగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 18 శాతం తగ్గింపు ఉంది. దాంతో రూ. 56,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్‌ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లతో ఈ డివైజ్‌ను మరింత తక్కువకు సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S22:
శామ్‌సంగ్ గెలాక్సీ S22 ధర రూ. 39,999కి తగ్గింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 85,999. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 53 శాతం తగ్గింపు అనంతరం గెలాక్సీ S22 రూ. 39,999 అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గుతుంది.

MOTOROLA Edge 40 Neo:
మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీ ఫోన్ తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 22,999కి లభిస్తోంది. మోటొరోలా ఎడ్జ్ 40 నియో (Caneel Bay 256 GB, 12 GB RAM) ఫోన్ ధర రూ. 29,999గా ఉండగా.. 23 శాతం తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లు దీనికి అదనం.

MOTOROLA Edge 40:
మోటొరోలా ఎడ్జ్ 40 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 24,999కి లభిస్తోంది. మోటొరోలా ఎడ్జ్ 40 MOTOROLA Edge 40 Nebula Green, 256 GB, 8 GB RAM) ఫోన్ ధర రూ. 34,999గా కాగా.. 28 తగ్గింపు ఆఫర్ ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు కలుపుకుంటే.. మరింత తక్కువకే మీకు లభిస్తుంది.

Also Read: AUS vs SA: భారత్ దెబ్బకు బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాపై రెండు మార్పులతో బరిలోకి!

OPPO Reno8 5G:
ఒప్పో రెనో 8 ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 27,249కే కొనుగోలు చేయవచ్చు. ఒప్పో రెనో 8 (OPPO Reno8 5G Shimmer Black, 128 GB, 8 GB RAM) అసలు ధర రూ. 38,999గా ఉండగా.. 30 తగ్గింపు ఆఫర్ ఉంది.

IQOO Neo 7 5G:
ఐకూ నియో 7 5జీ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లలో రూ. 28,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ (IQOO Neo 7 5G Frost Blue, 128 GB, 8 GB) RAM) అసలు ధర రూ. 34,999గా ఉండగా.. 17 శాతం తగ్గింపు ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు కలుపుకుంటే మరింత తక్కువకే ఈ ఫోన్ లభిస్తుంది.

Show comments