AUS vs SA: భారత్ దెబ్బకు బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాపై రెండు మార్పులతో బరిలోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia have won the toss and have opted to field: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో రసవత్తర సమరం ఆరంభం కానుంది. లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకునున్నాడు. భారత్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యటింగ్ చేసిన ఆసీస్.. బౌలర్ల దెబ్బకు 199 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
‘ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ వికెట్‌పై కాస్త తేమ ఉన్నట్టుంది. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. గ్రీన్ స్థానంలో మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ స్థానంలో జోష్ ఇంగ్లిస్ జట్టులోకి వచ్చారు. భారత్‌పై కొన్ని పరుగులు తక్కువగా చేశాం. అయితే మేము బౌలింగ్ చేసిన విధానం పట్ల చాలా సంతోషంగా ఉంది. దక్షిణాఫ్రికా టోర్నమెంట్‌ను చాలా బాగా ప్రారంభించింది. ఈ మ్యాచ్ మాకు పెద్ద సవాల్’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. మరోవైపు ప్రొటీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కోయెట్జీ స్థానంలో షమ్సీ ఆడుతున్నాడు.
Also Read
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రపంచకప్ 2023లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో మ్యాచ్ ఆడాయి. దక్షిణాఫ్రికా శ్రీలంకపై ఘన విజయం సాధించగా.. ఆస్ట్రేలియా మాత్రం టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా.. ఆసీస్ 3, ప్రొటీస్ 2 విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్ టై అయ్యింది. ఈ ఇరు జట్లు చివరిసారిగా 2019 ప్రపంచకప్‌లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోస్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్, టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి.
తాజావార్తలు
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!