Parliament: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయబోతున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేయ్యడం లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రేపు (గురువారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది.
Read Also: Indian railways Jobs 2024: ఇండియన్ రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
అయితే, తొలి రెండు రోజులు ఉభయ సభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ పార్లమెంట్ వ్యవహరాల శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇస్తారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది.
Read Also: Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన పసిడి ధరలు!
అయితే, ప్రస్తుత ఈ చివరి సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదించే ఛాన్స్ ఉంది. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 146 ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే, వారిలో 132 మందిపై దీన్ని ఆ సెషన్ వరకే విధించగా.. మిగతా 14 మందిలో 11 మంది రాజ్యసభ సభ్యులు, ముగ్గురు లోక్‌సభ సభ్యులున్నారు. ఈ 14 మంది సభ్యుల కేసును ఉభయసభల ప్రివిలేజ్ కమిటీలకు పంపించారు. జనవరి 12న లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముగ్గురు లోక్‌సభ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేస్తున్నట్లు సమాచారం.