Site icon NTV Telugu

Telangana Assembly : 27 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ పెట్టేది ఆ రోజే..

Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు స్టార్ట్ అయ్యాయి. బడ్జెట్ మీదనే ప్రధానంగా సాగనున్న ఈ సమావేశాలు మార్చి 27 వరకు జరుగుతాయి. 14న హోలీ, 16న ఆదివారం, 20, 23న సెలవులు ఉన్నాయి. ఈ నాలుగు రోజులు మినహాయించి 12 రోజులు కంటిన్యూగా సమావేశాలు జరగబోతున్నాయి. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగిస్తారు. అటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును 15వ తేదీన ప్రవేశపెట్టబోతోంది. 17, 18వ తేదీల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు.

Read Also : Vijayasai Reddy: మళ్లీ వైసీపీ ఘర్ వాపసీ ఉండదు..

కీలకమైన బడ్జెట్ ను 19వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెడుతారు. 20వ తేదీన సెలవు కాబట్టి 21, 22వ తేదీల్లో బడ్జెట్ మీద చర్చిస్తారు. 24 , 25, 26వ తేదీల్లో పద్దులపై చర్చలు జరుపుతారు. చివరగా 27వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెడుతారు. ఈ సమావేశాలు అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం బీసీలంతా ఎదురు చూస్తున్నారు. ఈ బిల్లులో బీసీ రిజర్వేషన్ల కోటాపై స్పష్టత వస్తే కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. అంతే కాకుండా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మొదటిసారి అసెంబ్లీలో ప్రసంగించబోతున్నారు. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానాలు చెప్పాలని రేవంత్ ప్రభుత్వం కసరత్తులు స్టార్ట్ చేసింది. కాబట్టి గతంలో జరిగిన సమావేశాల కంటే ఈ సమావేశాలు మరింత వేడెక్కడం ఖాయం.

Read Also : Ananya : రెండేళ్ల గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న హాట్ బ్యూటీ

 

Exit mobile version