NTV Telugu Site icon

Budget Sessions: జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. రెండో విడత సెంట్రల్ విస్టాలోనే!

Budget Sessions

Budget Sessions

Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా జరగనుండగా.. మొదటిసెషన్‌ జనవరి 31నుంచి ఫిబ్రవరి 10వరకు జరుగుతుంది. రెండో సెషన్‌ మార్చి 6నుంచి ఏప్రిల్‌ 6వరకు జరుగుతుందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు సూచన ప్రాయంగా పేర్కొన్నాయి. ఈ సమావేశాల తొలిరోజునే ఆర్థికసర్వే నివేదికను ఉభయసభల్లో ప్రవేశపెడతారని తెలిపారు.

Metro Employees Strike: జీతాలు పెంచాలని హైదరాబాద్‌ మెట్రో ఉద్యోగుల సమ్మె

బడ్జెట్‌ సమావేశాల తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై చర్చించనున్నారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారని వెల్లడించారు. రెండో విడత సమావేశాల్లో వివిధ మంత్రిత్వశాఖలకు నిధుల కేటాయింపుపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తెలపడం వంటివి చేపట్టనున్నారు. రెండవ విడత సమావేశాలు పార్లమెంట్‌ నూతన భవనం సెంట్రల్‌ విస్టాలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త భవనం నిర్మాణపనులు చురుగ్గా సాగుతున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలను సెంట్రల్‌ విస్టా హాలులోనే నిర్వహించేందుకు భవనాన్ని సిద్ధం చేస్తామని నిర్మాణ సంస్థ పేర్కొంటోంది.

Show comments