NTV Telugu Site icon

Union Budget: నిర్మల సీతారామన్ బడ్జెట్ లో ఆయాల రంగాలకు కేటాయింపులు ఇవే

New Project 2024 07 23t104850.743

New Project 2024 07 23t104850.743

Union Budget: మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ రైతులు, యువత, మహిళలపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా యూనియన్ ఫైనాన్స్ మినస్టర్ మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో మూడో సారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అన్నదాతల కోసం ఇటీవలే మద్దతు ధరలు పెంచినట్లు గుర్తు చేశారు. మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల ఉచిత రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Read Also:Hyper Aadi: వారంతా ఒక్కటే.. అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయడం ఆపండి!

శాఖల వారీగా కేటాయింపులు ఇవే..!
రక్షణ రంగం -4,54,773 కోట్లు
గృహ వ్యవహారాలు – 1,50, 983కోట్లు
వ్యవసాయ, అనుసంధాన రంగాలు – రూ. లక్షా 52 వేల కోట్లు
విద్య, నైపుణ్యాభివృద్ధి – రూ.లక్షా 48 వేల కోట్లు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – రూ.2.2లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి – రూ.2.66 లక్షల కోట్లు
మహిళాభివృద్ధి – రూ.3 లక్షల కోట్లు
మౌలిక సదుపాయాలు – రూ. 11.11 లక్షల కోట్లు
ఐటీ టెలికాం – 1,16,342కోట్లు
ఆరోగ్యం – 89,287కోట్లు
ఎనర్జీ – 68,769కోట్లు
సోషల్ వెల్ఫేర్ – 56,501కోట్లు
కామర్స్ అంట్ ఇండస్ట్రీ – 47,559కోట్లు

Read Also:TDP MPs on Union Budget: బడ్జెట్ ద్వారా ఏపీ ప్రజలకు ఉపశమనం.. పెండింగ్ సమస్యలకు పరిష్కారం

ఆయా రంగాలతో పాటు ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌లకు కేంద్ర బడ్జెట్‌లో ప్రియారిటీ దక్కింది. ఏపీ, బిహార్‌ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు – రూ.15 కోట్లు
బిహార్‌లో జాతీయ రహదారులకు రూ.20 వేల కోట్లు సహాయం