NTV Telugu Site icon

Buddy OTT: ఓటీటీలోకి ‘బడ్డీ’ సినిమా.. ఏ ఓటీటీ ప్లాట్‭ఫామ్‭లో చూడొచ్చంటే..

Buddy

Buddy

Buddy Movie In Netflix from August 30th: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో ఒకడైన అల్లు శిరీష్ ఇటీవల యాక్షన్ కామెడీ చిత్రం ‘బడ్డీ’ సినిమాతో సినీ ప్రేక్షకులను థియేటర్స్ లో పలకరించాడు. ఆగస్టు 2 విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త విఫలమైందని చెప్పవచ్చు. అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానే వచ్చేసింది. ఆగస్టు 30న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతోంది.

Viral Video: ఇంట్లో బెడ్ అనుకున్నావా నాయనా.. రైలు పట్టాలపై ఎలా నిద్రపోతున్నాడో చూడండి

ఇకపోతే, ఈ చిత్రాన్ని ఇదివరకు తమిళంలో హీరో ఆర్య నటించిన ‘టెడ్డి’ సినిమాకి రీమేక్ గా చేశారు. ఆంటోన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటించింది. చూడాలి మరి థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన బడ్డీ ఓటీటీలోనైనా మెప్పిస్తుందో లేదో.

Show comments