మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం అని, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలిందన్నారు. 2024లో రాక్షస పాలన పోయి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 1932లో జనవరి 4న గాంధీ అరెస్టు ఎలా గుర్తుందో.. 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్టు రాష్ట్రంలో ప్రజలకు అలానే గుర్తు ఉంటుందన్నారు.
ఆదివారం విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ… ‘టికెట్స్ లేవంటే వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు హ్యాపీగా వెళ్లిపోతున్నారు. వైసీపీ బీఫామ్ ఎవరికి ఇచ్చినా ఓడిపోతారు. టీడీపీ-జనసేన బీఫామ్ వచ్చిన వారు ఎమ్మెల్యే అవుతారు. ఎలాగో ఒడిపోతారు కాబట్టి వైఎస్ జగన్ నిర్ణయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. 2023 జగన్ మోహన్ రెడ్డి విద్వంస నామా సంవత్సరంగా నామకరణం చేశాం. 2024లో చంద్రబాబు సీఎం అవ్వడం అంటే కొత్త రాష్ట్రం ఏర్పడినట్టే. 1932లో జనవరి 4న గాంధీ అరెస్టు ఎలా గుర్తుందో.. 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్టు రాష్ట్రంలో ప్రజలకు అలానే గుర్తు ఉంటుంది’ అని అన్నారు.
Also Read: Kasu Mahesh Reddy: ఎవరినీ తొక్కాల్సిన అవసరం నాకు లేదు: మహేష్ రెడ్డి
‘బలహీన వర్గాల పార్టీ టీడీపీ. ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన బొత్స సత్యనారాణయ ఈ రోజు వైఎస్ జగన్ ముందు ఎలా ఉన్నాడో? చుస్తే బలహీన వర్గాల పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. బొత్సతో మైకులు లేకుండా మాట్లాడితే.. మొత్తం వివరాలు చెపుతారు. జెండాను మోసిన వారిని, పార్టీని నమ్ముకున్న వారికి తగిన న్యాయం చంద్రబాబు చేస్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయం. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలింది’ అని బుద్దా వెంకన్న చెప్పారు.