Site icon NTV Telugu

Vijayawada: బుడమేరు పొంగుతుంది..! విజయవాడలో మళ్లీ వరదలు అంటూ వదంతులు..!!

Vijayawada

Vijayawada

Vijayawada: గత ఏడాది ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు.. బుడమేరు పొంగి విజయవాడ అతలాకుతలం అయిన విషయం విదితమే.. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.. సహాయక చర్యలు ముమ్మరంగా నిర్వహించింది.. అయినా.. వరదలు, ఆ తర్వాత బురద నుంచి తేరుకోవడానికి విజయవాడ వాసులకు సమయం పట్టింది.. బెజవాడ వాసులకు అదో పీడకలలా మారిపోయింది.. అయితే, బుడమేరు మళ్లీ పొంగుతోంది అంటూ.. విజయవాడకు మరోసారి వరద ముప్పు తప్పదంటూ కొందరు ఫేక్‌గాళ్లు.. సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి తెరలేపారు.. విజయవాడలో వరదలు వస్తాయి అని పుకార్లు సృష్టించారు.. దీంతో, భయాందోళన గురవుతున్నారు విజయవాడ వైస్సార్ కాలనీ వాసులు..

Read Also: Supreme Court: “నాన్న, నాకు రూ. కోటి ఇస్తేనే మీతో ఉంటా”.. తండ్రికి 12 ఏళ్ల కుమార్తె డిమాండ్

విజయవాడ వర్షాల కారణంగా మళ్లీ బుడమేరు పొంగుతుంది.. అని సోషల్ మీడియా పోస్టులతో కొంతమంది హల్చల్ చేస్తున్నారు.. దీంతో, వర్షాలు పెరిగితే మళ్లీ బుడమేరు కట్ట తెగి.. మళ్లీ వరదలు వస్తాయి అని విజయవాడ వైస్సార్ కాలనీ వాసులు భయపడుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో జరుగోతన్న ఈ తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేశారు పోలీసులు.. ఆ తప్పుడు వార్తలు నమ్మవద్దు అని కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు.. పోలీసు జీపుతో వైస్సార్ కాలనీకి వచ్చిన పోలీసులు.. ఎలాంటి వరదలు రావడం లేదు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వరదల వార్తలను నమ్మకండి.. ప్రస్తుతం వరదలు వచ్చే ఎలాంటి సూచనలు లేవు.. అటువంటి పరిస్థితి ఉంటే అందరికీ ముందుగా విషయం తెలియపరచి.. తగు చర్యలు తీసుకుంటామని మైక్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు.. ప్రజలు ఎవరు దయచేసి పుకార్లు నమ్మవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు..

Exit mobile version