NTV Telugu Site icon

Budameru: ఆపరేషన్ బుడమేరు సక్సెస్.. మూడో గండిని పూడ్చివేసిన అధికారులు

Budameru

Budameru

Budameru: ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అయింది. బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చగా.. తాజాగా మూడో గండిని అధికారులు పూడ్చివేశారు. నాలుగు రోజులుగా గండ్ల పూడ్చివేత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరద ఉధృతితో బుడమేరుకు మూడు గండ్లు పడ్డాయి. మూడో గండి పూడ్చివేత పూర్తి కావడంతో బెజవాడకు తప్పిన వరద ముప్పు తప్పింది. వర్షంలోనే మూడో గండి పూడ్చివేత కొనసాగింది. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో గండ్ల పూడ్చివేత కొనసాగింది. గండ్లను విజయవంతంగా పూర్తిచేసిన మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.

Read Also: Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కును అందించిన పవన్‌కల్యాణ్

లెఫ్ట్ బండ్ మూడు గండ్లు సీఎం చంద్రబాబు సూచనలతో పూడ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎంత ఎక్విప్మెంట్ అయినా వినియోగించుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు. పనులు ఆపకుండా, తీవ్ర గాలులను లెక్క చేయకుండా పని చేశామన్నారు. మిలిటరీ సైతం మా పనులను అభినందించిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్ కారణంగానే ఇదంతా సాధ్యమైందన్నారు. చంద్రబాబు కలెక్టరేట్‌లో ఉండి రెండు గంటలు కూడా నిద్రపోలేదన్నారు. మంత్రులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటున్నారని.. కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇది అని వ్యాఖ్యానించారు. బుడమేరుకు మరో 8వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే అప్పటి సీఎం పట్టించుకోలేదని విమర్శించారు. మా ప్రభుత్వంలో ప్రజల్లోనే ఉంటున్నామని పేర్కొన్నారు. “బుడమేరును ఐదేళ్ళలో జగన్ పట్టించుకోలేదు. 35వేల క్యూసెక్కులు ప్రవహించేలా చంద్రబాబు టెండర్లు పిలిచారు. మిగిలిన పనులు గత ప్రభుత్వం పూర్తి చేయలేదు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ 11 గేట్లు వరద ఉధృతి ఆధారంగా లిఫ్ట్ చేశాం. కొల్లేరుకు కనుక నీటిని పంపి ఉండకపోతే బుడమేరు లెఫ్ట్ బండ్ పోయేది.” అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.