Site icon NTV Telugu

Kovur YSRCP: కోవూరులో వైసీపీకి షాక్‌..

Ysrcp

Ysrcp

Kovur YSRCP: నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ)కి షాక్‌ తగిలింది.. ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్‌ మరికొన్ని రోజుల్లో జరగనుండగా.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు కీలక నేత.. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్‌పర్సన్ మోర్ల సుప్రజాతో పాటు ఆమె భర్త మోర్ల మురళి, కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ వైసీపీని వీడారు.. నెల్లూరు లోక్‌సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్ది సమక్షంలో టీడీపీలో చేరారు.. కాగా, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. వైసీపీలో అభ్యర్థుల మార్పుపై సంకేతాలు వచ్చినప్పటి నుంచి కొందరు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడారు.. ఇక, టీడీపీ-బీజేపీ-జనసేన జట్టుకట్టిన తర్వాత.. కొందరు నేతలకు టికెట్లు దక్కకపోవడంతో.. టీడీపీకి కొందరు.. జనసేనకు మరికొందరు ఇలా రాజీనామా చేసి.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. ఇక, మరికొందరు కాంగ్రెస్‌ పార్టీలో సైతం చేరిన విషయం విదితమే.

Read Also: Ac Not Working: ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేయని ఏసీలు.. ఉక్కపోతతో రోగులు ఉక్కిరిబిక్కిరి

Exit mobile version