Site icon NTV Telugu

HCA : బుచ్చిబాబు టోర్నమెంట్‌ గెలిచిన హైదరాబాద్ క్రికెట్ టీంకి హెచ్‌సీఏ ఆధ్వర్యంలో సన్మానం

Jagan Mohan Rao

Jagan Mohan Rao

ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుచ్చిబాబు టోర్నమెంట్ ని గెలుపొందిన హైదరాబాద్ క్రికెట్ టీంకి హెచ్ సిఎ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ టీం, చెన్నైలో జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన సందర్భంగా క్రికెట్ టీం కి 25లక్షల నగతు బహుమతిని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ప్రకటించారు. హెచ్‌సీఏ టీమ్ కి హెడ్ ఆపరేషన్ గా ఉన్న మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వారికి అభినందనలు తెలియజేశారు… ఈ సందర్భంగా హెచ్ సిఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ… రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్ లలో హైదరాబాద్ క్రికెట్ టీం అనేక విజయాలు సాధించి, రంజీ టోర్నమెంట్ లో రాణించాలని అన్నారు… ప్రతి ఐపీఎల్ కి హైదరాబాద్ క్రికెట్ టీం నుండి క్రిసెట్లర్లు సెలెక్ట్ అయ్యే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కృషిచేస్తుందని జగన్ మోహన్ రావు తెలిపారు… ఈ కార్యక్రమంలో టీమ్ సభ్యులతో పాటు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ రావు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

China: చైనా దేనికి భయపడుతుంది? ప్రతి విద్యార్థికి సైనిక శిక్షణ ఇచ్చేలా చట్టం!

Exit mobile version