స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి ఈవెంట్ అయినా, స్టార్ హీరో ప్రీ రిలీజ్ అయినా యాంకర సుమ సందడి ఉండాల్సిందే. అంతగా ఆమె గుర్తింపు పొందారు. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ప్రముఖ నటుడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో, పాన్ ఇండియా చిత్రాల్లో ప్రధాన పాత్రలు, ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా కొనసాగుతున్నారు.ఇప్పుడు వారి తనయుడు రోషన్ కనకాల కూడా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు.’బబుల్ గమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ‘క్షణం’ మరియు ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరేపు ఈ సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇందులో రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది.ఈ మూవీ రిలీజ్‌కు ముందు ఓ రేంజ్‌లో ప్రమోట్ చేసి హైప్ పెంచారు. అలా మంచి అంచనాలతో గతేడాది డిసెంబర్‌లో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
లవ్ అండ్ రొమాంటిక్ డ్రామగా వచ్చిన ఈ సినిమాలో విపరీతమైన ముద్దు సీన్లు, హైవోల్డేజ్ రొమాన్స్ ఇలా బోల్డ్ కంటెంట్‌తో తీసుకువచ్చారు.యూత్‌ని టార్గెట్ చేస్తూ తీసుకువచ్చిన ఈ చిత్రం వారిని కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఫిబ్రవరి 9న బబుల్ గమ్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. వెండితెరపై బోల్తా కొట్టిన ఈ మూవీ రీసెంట్‌గా ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈచిత్రం తాజాగా ఓటీటీలో అదరగొట్టింది. వన్ మినిట్‌లో 100 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా దీనిపై ఆహా తమ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. “హై వోల్డేజ్ రొమాంటి డ్రామా బబుల్ గమ్ మూవీ రికార్డు స్రష్టించింది. ఒక్క నిమిషంలో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికీ అదే వ్యూస్‌తో దూసుకుపోతుంది” అంటూ తాజాగా ఆహా ట్వీట్ చేసింది. ఇది చూసి మూవీ లవర్స్ షాక్ అవుతున్నారు. ఓటీటీలోకి వచ్చిన నెల రోజుల తర్వాత బబుల్ గమ్ మూవీ ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం ఏంటని షాక్ అవుతున్నారు.
#Bubblegum hits 100 million minutes of HIGH VOLTAGE romance and still going strong! 😈
DON'T MISS IT! 🥰Watch #BubblegumOnAha now ▶️https://t.co/ZxVIxTEueE#BubblegumOnAha @ahavideoIN @ravikanthperepu @RoshanKanakala @Maanasa_chou @ItsSumaKanakala @sureshraghu_DOP… pic.twitter.com/tbIczrjefI
— ahavideoin (@ahavideoIN) March 23, 2024