NTV Telugu Site icon

BSNL 4G: డిసెంబర్‌లో 4జీ సేవలను ప్రారంభించనున్న బీఎస్‌ఎన్‌ఎల్.. 5జీ అప్పుడే?

Bsnl

Bsnl

BSNL 4G: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎస్‌ డిసెంబర్‌లో 4G సేవలను చిన్న స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ సమాచారాన్ని కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ శనివారం తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో మాట్లాడిన పుర్వార్.. జూన్ తర్వాత కంపెనీ తన 4జీ సేవలను 5 జీకి అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

Also Read: Keedaa Cola : గ్రాండ్ గా జరగనున్న కీడా కోలా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..

డిసెంబర్‌లో పంజాబ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సేవను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని పుర్వార్ చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రాంతాల్లో పరీక్షించినట్లు ఆయన వెల్లడించారు. పంజాబ్‌లో 3,000 ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించి.. దశలవారీగా ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తామని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ క్రమంగా దశల వారీగా నెట్‌వర్క్ విస్తరణను 6,000కి పెంచుతుందని, ఆపై నెలకు 9,000, 12,000 మరియు 15,000 ప్రాంతాలకు పెంచుతుందని కూడా ఆయన తెలియజేశారు. 2024 జూన్‌ నాటికి 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందజేయాలని బీఎస్ఎన్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 2024 తర్వాత వారు 4జీ సేవలను 5Gకి అప్‌గ్రేడ్ చేస్తారు. 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఐటీ కంపెనీ టీసీఎస్‌, ప్రభుత్వ రంగ ఐటీఐకి బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.19వేల కోట్ల విలువైన పనిని అప్పగించిన సంగతి తెలిసిందే. 4జీ అప్‌డేట్‌ పూర్తయిన తర్వాత 5జీ సేవలను అమలు చేయడానికి బీఎస్‌ఎన్‌ఎల్ వద్ద తగినంత స్పెక్ట్రమ్ ఉందని పుర్వార్ వెల్లడించారు.