Site icon NTV Telugu

BSNL Recharge Plan: బంపర్ ఆఫర్.. కేవలం రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ

Bsnl 201

Bsnl 201

BSNL Recharge Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అనేక ఆఫర్స్ ను తీసుక వస్తుంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు మిగితా నెట్వర్క్ లతో పోలిస్తే చాలా చౌకగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్‌లు వినియోగదారుల మధ్య చాలా ప్లన్స్ ట్రెండ్‌లో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు తక్కువ ధరలకు ఉత్తమ ఆఫర్లను అందించడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఒకవేళ మీరు బీఎస్ఎన్ఎల్ సిమ్ ని ఉపయోగిస్తుంటే అందుకోసం తక్కువ ధరలో పొడిగించిన చెల్లుబాటుతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఒక గొప్ప ప్లాన్‌ ఉంది. ఇందుకోసం రూ.201 ప్లాన్ మీకు సహాయకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజుల వరకు ఉంటుంది. ఈ ప్లాన్‌తో ఉచిత కాలింగ్, ఇంటర్నెట్ డేటా కూడా అందుబాటులో ఉంటుంది.

Also Read: Helicopter For Bride: వధువును ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసిన వరుడు

బీఎస్ఎన్ఎల్ కొన్ని సర్కిల్‌లలో రూ. 201 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ BSNL ప్లాన్‌లో కస్టమర్‌లు 90 రోజుల చెల్లుబాటును పొందుతారు. దీనితో పాటు, కంపెనీ ప్లాన్‌లో 300 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. మీకు ఎక్కువ ఇంటర్నెట్ డేటా అవసరం లేకపోతే ఈ ప్లాన్ మీకు ఖచ్చితంగా సరిపోతుంది. ఇందులో మొత్తం 6GB డేటా లభిస్తుంది. కంపెనీ ఇందులో 99 ఉచిత SMSలను కూడా ఇస్తుంది. బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ https://www.bsnl.co.in సందర్శించడం ద్వారా మీరు ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ మీ నగరంలో అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయవచ్చు. అయితే ఈ ప్లాన్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ ను సెకండరీ సిమ్‌గా ఉపయోగించే, తక్కువ డబ్బుతో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్.

Also Read: Maharashtra Next CM: “మోడీకి నా కొడుకు అంటే చాలా ఇష్టం. నా కుమారుడే సీఎం అవుతాడు”

Exit mobile version