BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్‌స్క్రిప్షన్స్ కూడా..

Bsnl Ftth

Bsnl Ftth

BSNL Rs 259 Broadband Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మరో చవకైన బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.259 ధరతో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకవచ్చింది బిఎస్ఎన్ఎల్. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌నెట్ (BharatNet) కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు ఈ ప్లాన్‌ను తీసుకవచ్చారు.

రూ.259 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌:

బిఎస్ఎన్ఎల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో వినియోగదారులకు 25Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా, దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అంతేకాకుండా వినోదం కోసం వేవ్స్ OTT సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. ముఖ్యంగా ఈ ప్లాన్‌లో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు లేవు. దీంతో మొదటిసారి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే గ్రామీణ వినియోగదారులకు ఇది మరింత ప్రయోజనకరంగా మారనుంది. ఆన్‌లైన్ చదువులు, వర్క్ ఫ్రం హోమ్, వీడియో కాల్స్, OTT వినోదం వంటి అవసరాలకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.

రూ.51 ప్రీపెయిడ్ ప్లాన్:

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో పాటు కొత్త మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూ.51 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను కూడా ప్రకటించింది. కొత్తగా BSNL సిమ్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 2GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు అందించనున్నారు. అదనంగా ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. ఇది ప్లాన్ ఒక ప్రమోషనల్ ఆఫర్. ఇది 2026 జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతకుముందు కూడా కంపెనీ కేవలం రూ.1 రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టి 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా ప్రయోజనాలను అందించింది.