BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
- BSNL రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్
- అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ
- సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీ.. ప్రస్తుతం మొత్తం 412 రోజుల వ్యాలిడిటీ
- ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో
- ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా
- అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. దీర్ఘకాలికంగా ఉపయోగపడే రూ.2,399 వార్షిక ప్లాన్ వ్యాలిడిటీని తాత్కాలికంగా పెంచింది. సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీని అందించే ఈ ప్లాన్‌పై ఇప్పుడు మరో 47 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. దీంతో మొత్తం వ్యాలిడిటీ 412 రోజులకు చేరింది.
ఈ కొత్త ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఈ కాలంలో రూ.2,399 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే సాధారణ 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అదనంగా 47 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి. డేటా పరంగా రోజుకు 2GB హై-స్పీడ్ డేటా అందుతుంది. రోజువారీ 2GB డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40Kbpsకు తగ్గుతుంది.
Also Read
- BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
- AI Jobs Impact: AI ప్రభావం.. 9.2 కోట్ల ఉద్యోగాలు మాయం.. కానీ, 17 కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలు
- 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- కొత్త 'ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే'తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
ఈ ప్లాన్ సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే ప్రస్తుతం అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ కారణంగా మరో 47 రోజులు అదనంగా లభిస్తాయి. దీంతో మొత్తం వ్యాలిడిటీ 412 రోజులకు చేరుతుంది. 365 రోజుల సాధారణ వ్యాలిడిటీని పరిగణనలోకి తీసుకుంటే రూ.2,399 ప్లాన్‌కు రోజుకు సుమారు రూ.6.57 ఖర్చవుతుంది. అయితే ప్రస్తుత ఆఫర్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ పొందితే రోజువారీ ఖర్చు సుమారు రూ.5.82కు తగ్గుతుంది.
దీర్ఘకాలం ఉపయోగించాలనుకునే కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉండనుంది. ముఖ్యంగా తరచూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏడాదికి పైగా కాలం పాటు కాలింగ్, SMS, డేటా సేవలను పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ అదనపు వ్యాలిడిటీ ఆఫర్‌ను తీసుకవచ్చారు. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 మధ్య రూ.2,399 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రమే 47 రోజుల అదనపు వ్యాలిడిటీని పొందగలరు.
🇮🇳 This Independence Day, BSNL brings you more! 💙
Get 47 extra days with the ₹2399 Plan — 365 days → 412 days!
📞 Unlimited Calls | 📶 2GB/Day | 📩 100 SMS/Day
📅 Valid till 12th September 2026#BSNL #IndependenceDay #BSNL2399 pic.twitter.com/opibGnZq4x— BSNL_Telangana (@bsnl_tt) August 12, 2026
తాజావార్తలు
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్‌పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
ట్రెండింగ్
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!