BSNL Rs 699 and Rs 999 plans validity increased: సాధారణంగా టెలికాం సంస్థలు తమ ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) పెంచుకోవడానికి ప్రీపెయిడ్ ప్లాన్ల గడువును కుదిస్తుంటాయి. ఇప్పటికే దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను కుదించాయి. అయితే ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఊహించని విధంగా రెండు ప్లాన్ల గడువును ఇటీవల పెంచింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాన్లను కంపెనీ సుదీర్ఘకాలంగా తమ కస్టమర్లకు అందిస్తోంది.
రూ.699 ప్లాన్, రూ.999 ప్లాన్‌ల గడువును బీఎస్‌ఎన్‌ఎల్ పెంచింది. రూ.699 ప్లాన్ గడువును 130 రోజుల నుంచి 150 రోజులకు పెంచిన బీఎస్ఎన్ఎల్.. రూ.999 వ్యాలిడిటీని 200 రోజుల నుంచి 215 రోజులకు పెంచింది. ఈ మేరకు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్, బీఎస్ఎన్ఎల్ యాప్‌లో మార్పులు చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్ తమ 4జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: WPL 2024: నేడు ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్.. ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.699 ప్లాన్‌లో రోజుకు 0.5జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు, అపరిమిత కాలింగ్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులు. తొలి 60 రోజుల పాటు పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ కూడా లభిస్తుంది. మరోవైపు రూ.999 ప్లాన్‌లో ఎలాంటి డేటా, ఎసెమ్మెస్ ప్రయోజనాలు ఉండవు. అపరిమిత వాయిస్ కాలింగ్, రెండు నెలల పాటు పీఆర్‌బీటీ లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 215 రోజులు.