BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను ప్రకటించింది. కేవలం నెలకు రూ.259కే హైస్పీడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత OTT సదుపాయంతో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌నెట్ (BharatNet) ప్రాజెక్టు, డిజిటల్ భారత్ నిధి మద్దతుతో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడమే ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశం.
700GB హైస్పీడ్ డేటా:
ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 25 Mbps వరకు బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ లభిస్తుంది. ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్, వీడియో స్ట్రీమింగ్, వీడియో కాల్స్ వంటి అవసరాలకు ఇది సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. వినియోగదారులు 700GB వరకు పూర్తి వేగంతో డేటా ఉపయోగించుకోవచ్చు. ఆ పరిమితి దాటిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవ కొనసాగుతుంది. అయితే స్పీడ్ 2 Mbpsకు తగ్గుతుంది. వాటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు మాత్రం ఉండవు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- TG20 తొలి ఛాంపియన్‌గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్లతో ఘన విజయం.!
అన్లిమిటెడ్ కాల్స్:
ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా కొత్త కనెక్షన్ తీసుకునే వారికి ఉచిత ఇన్స్టాలేషన్ తోపాటు మోడెమ్ కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు BSNL తెలిపింది. దీంతో ప్రారంభంలో ఎలాంటి ఎక్స్ట్రా చార్జీలు ఉండవు.
ఉచితంగా OTT:
బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో పాటు Waves OTT ప్లాట్‌ఫామ్‌కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇందులో సినిమాలు, టీవీ షోలు, ఇతర వినోద కార్యక్రమాలను అదనపు చార్జీలు లేకుండా వీక్షించవచ్చు. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంట్ రెండూ పొందవచ్చు.
ఇదిలా ఉండగా, ఇటీవల BSNL శాటిలైట్ ఫోన్ ను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించింది. సాధారణ మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాలు, అడవులు, సముద్ర ప్రయాణాలు, గనులు, ట్రెక్కింగ్ ప్రాంతాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫోన్ ఉపయోగపడేలా రూపొందించారు. దీంతో విపత్కర పరిస్థితుల్లో కూడా కమ్యూనికేషన్ కొనసాగించే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?