BSNL Offer: భారతదేశ టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) విప్లవాత్మకంగా ముందుకు సాగుతోంది. తక్కువ ధరలలో నాణ్యమైన సేవలను అందించడంలో సంస్థ ముందుండి ప్రవేట్ టెలికం కంపెనీలకు పోటీలో నిలుస్తోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీఎస్‌ఎన్‌ఎల్ తాజా రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే, మొబైల్ వినియోగదారులు కొందరు వారి ఇంట్లోనూ, అలాగే పని చేసే స్థలంలో వైఫై ఉండడంతో కేవలం కాల్స్, వ్యాలిడిటీ కొరకే రీఛార్జి ప్లాన్లను వెతుకుతున్నారు. ఈ పరిస్థితి తగ్గట్టుగా బిఎస్ఎన్ఎల్ తన కొత్త ఎత్తుగడలను వేస్తూ.. ప్రవేట్ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ల కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ ఛాలెంజ్ లను విసురుతోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీఎస్‌ఎన్‌ఎల్ తాజా రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read: MG Windsor EV: కొనుగోలుదారులకు షాక్.. కార్ల ధరను భారీగా పెంచేసిన ఎంజీ
తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ రూ.439 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ వివరాలను చూస్తే.. ఇందులో 90 రోజుల భారీ వ్యాలిడిటీని అందిస్తోంది. అలాగే అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్, 300 SMS లు పంపుకునే సదుపాయం పొందుతారు. అయితే, ఇందులో డేటా మాత్రం లభించదు. ఈ ప్లాన్ ప్రధానంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు, కేవలం కాలింగ్ అవసరాలు ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా, బీఎస్‌ఎన్‌ఎల్ ను రెండో సిమ్‌గా ఉపయోగించేవారికి కూడా ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.
Also Read: UI Movie : “యూఐ” మూవీకి సంబంధించిన ఆ వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన యూనిట్
ఇకపోతే, టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల టెలికాం సంస్థలకు డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తేవాలని సూచించింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ సూచనల ఆధారంగా వినియోగదారుల కోసం ఇలాంటి ప్లాన్‌లను తీసుకువచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం తక్కువ ధరలతో నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతోంది. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే తక్కువ ధరల ప్లాన్‌లు, విభిన్న ఆప్షన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.