Site icon NTV Telugu

BSNL: గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ గడువు పొడిగింపు..

Bsnl Azadi Ka Plan

Bsnl Azadi Ka Plan

BSNL: ప్రభుత్వ రంగ సంస్థ టెలికాం సంస్థ బీస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తుండటంతో మరో 15 రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ఆదివారంతో గడువు ముగియగా దానిని ఈనెల 15వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.1కే ఉచిత సిమ్‌తో పాటు 30 రోజుల అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.

READ ALSO: Tunnel: సెప్టెంబర్ 12న తెలుగులో అథర్వ మురళి ‘టన్నెల్’

ఫ్రీడమ్ ప్లాన్ ఎప్పుడు ప్రారంభమైందంటే..
BSNL తన ఫ్రీడమ్ ప్లాన్‌ను ఆగస్టు 1న ప్రారంభించింది. వినియోగదారుల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి ఈ ప్లాన్‌ను ఈ నెల 15 వరకు పొడిగించింది. ఈసందర్భంగా BSNL CMD ఎ.రాబర్ట్ జె.రవి మాట్లాడుతూ.. BSNL ఇటీవలే దేశవ్యాప్తంగా మేక్-ఇన్-ఇండియా, అత్యాధునిక 4G మొబైల్ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్తుంది. ఫ్రీడమ్ ప్లాన్ మొదటి 30 రోజులు సర్వీస్ ఛార్జీలు పూర్తిగా ఉచితం. BSNL బ్రాండ్‌తో అందిస్తున్న సేవాలు కారణంగా కస్టమర్‌లు తమ సంస్థతో ఎక్కువ కాలం ఉండటానికి ప్రోత్సహిస్తాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్లాన్ ఎలా పొందాలంటే..
సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) ని సందర్శించండి. ఫ్రీడమ్ ప్లాన్ రూ.1 యాక్టివేషన్ కోసం KYC పూర్తి చేసి మీ ఉచిత సిమ్‌ను తీసుకోండి. సూచనల ప్రకారం సిమ్ ఇన్సర్ట్ చేసి యాక్టివేషన్ పూర్తి చేయండి. యాక్టివేషన్ తేదీ నుంచి మీ 30 రోజుల ఉచిత ప్రయోజనాలు ప్రారంభమవుతాయి. సహాయం కోసం 1800-180-1503 కు కాల్ చేయండి లేదా bsnl.co.in ని సందర్శించండి.

READ ALSO: Rinku Singh: ఒక్క మ్యాచ్‌లో 27 సిక్సర్లు.. రింకు సింగ్ వీరవిహారం..

Exit mobile version